: త్వరలో గుజరాత్ లో పర్యటిస్తా: అక్బరుద్దీన్


చంపడానికి పన్నిన కుట్రలను తట్టుకుని నిలబడ్డానని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అన్నారు. ఎంఐఎం వ్యవస్థాపకుడు సలావుద్దీన్ ఓవైసీ వర్ధంతి సందర్భంగా నిన్న రాత్రి హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన బహిరంగ సభలో అక్బరుద్దీన్ ఆవేశంగా మాట్లాడారు. ముస్లింలు, మైనారిటీల హక్కుల కోసం మజ్లిస్ పోరాడుతూనే ఉంటుందని చెప్పారు. ముస్లింలంతా ఐక్యంగా ఉండాలన్నారు. ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మోడీ హైదరాబాద్ సభలో మాత్రం ఒక్క మాట అనలేదని, దానికి కారణం ఇక్కడ ముస్లింలు ఐక్యంగా ఉండడమేనన్నారు. మైనారిటీల హక్కుల పరిరక్షణ కోసం గుజరాత్ సహా పలు రాష్ట్రాలలో పర్యటిస్తానని ప్రకటించారు. హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి తాము అంగీకరించబోమన్నారు.

  • Loading...

More Telugu News