: ఢిల్లీలో సమైక్య జ్వాలలు
సమైక్యాంధ్ర ఉద్యమ జ్వాలలు ఢిల్లీని తాకాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఢిల్లీలో ఈ ఉదయం విశాలాంధ్ర మహాసభ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు తెలుగు ఉద్యోగుల సంఘంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు సంఘీభావం తెలిపారు. అంతేగాకుండా, విశాలాంధ్ర నేతల ధర్నాకు మద్దతుగా ఏపీభవన్ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు.