: అంగారకుడిపై నివాసానికి 1800 మంది భారతీయుల దరఖాస్తు


అంగారకుడిపై మానవ మనుగడ సాధ్యమేనా? అన్నది తెలుసుకునేందుకు ఒకవైపు అమెరికా నాసా, మనదేశానికి చెందిన ఇస్రో ప్రయత్నిస్తుంటే.. మరోవైపు 2023 నాటికి అంగారకుడిపై ఆవాసానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది నెదర్లాండ్స్ కు చెందిన 'మార్స్ ఒన్' అనే సంస్థ. లాభాపేక్షలేని ఈ సంస్థ 2011లో ఏర్పాటైంది. 2023 నాటికి అంగారకుడిపై శాశ్వత నివాసం ఏర్పాటు చేయాలన్నది ఈ సంస్థ లక్ష్యం. అరుణ గ్రహంపై సెటిలైపోవాలనునే ఆసక్తి ఉన్న వారి నుంచి తన వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. రిజిస్ట్రేషన్ కింద 7 డాలర్లను చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుల్లోంచి కొందరిని సంస్థ ఎంపిక చేస్తుంది.

ఇప్పటి వరకూ ప్రపంచ నలుమూలల నుంచి లక్షమందికి పైగా మేం రెడీ అంటూ దరఖాస్తు చేసుకున్నారు. అందులో 1800 మంది భారతీయులు ఉన్నారు. అమెరికా పౌరులు 30,000 మంది ఉన్నారు. అంగారకుడిపై సెటిలైపోవాలని ఎంత మంది ఆరాటపడుతున్నారో ఈ స్పందన చూస్తే తెలుస్తుంది. నాసా క్యూరియాసిటీ రోవర్ అంగారకుడిపై పరిశోధనలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఇస్రో కూడా అంగారకుడిపై మనిషి మనుగడ సాధ్యమేనా? అని తెలుసుకునేందుకు ఉపగ్రహాన్ని ప్రయోగించే ప్రాజెక్టు చేపట్టింది. అయితే, ఆలూ లేదు చూలూ లేదు అన్న చందంగా నెదర్లాండ్స్ సంస్థ ఏడు డాలర్ల చొప్పున బానే పోగేస్తోంది!

  • Loading...

More Telugu News