: రేపటి నుంచి ఇందిరాపార్క్ వద్ద దీక్ష: కోదండరాం
రాష్ట్ర విభజన ప్రకటన అనంతరం రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో తాము మళ్ళీ ఉద్యమబాట పట్టాల్సి వస్తోందని తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మహబూబ్ నగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రేపటి నుంచి ఈ నెల 25 వరకు హైదరాబాదు ఇందిరాపార్క్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో దీక్ష చేపడుతున్నట్టు తెలిపారు.