: పచ్చదనాల సిక్కిం


ఈశాన్య రాష్ట్రాలలో ఒకటైన సిక్కిం వనాలతో వెలిగిపోతోంది. పచ్చదనంతో కొత్తకాంతులీనుతోంది. దేశవ్యాప్తంగా అటవీ ప్రాంతం తరుగుతూ ఉంటే, ఈ రాష్ట్రంలో మాత్రం పెరుగుతూ వస్తోంది. 1993లో ఈ రాష్ట్రం మొత్తం భూభాగంలో అటవీ ప్రాంతం 43.95శాతంగా ఉంటే.. అది 2013 నాటికి 47.34 శాతానికి పెరిగింది. దేశంలో ఈ ఒక్క రాష్ట్రమే ఈ ఘనత సాధించింది.

ఇక్కడ 3,359 హెక్టార్ల చదరపు కిలోమీటర్ల మేర అడవులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా సగటు అటవీ ప్రాంతం 21 శాతమైతే.. సిక్కింలో 47.34 శాతం ఉండడం అక్కడి ప్రజలు, ప్రభుత్వాల గొప్పతనంగా చెప్పుకోవచ్చు. ఇక 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) కాలంలో అదనంగా 1000 వెయ్యి హెక్టార్ల పరిధిలో మొక్కలు నాటాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

  • Loading...

More Telugu News