: నేటి ఆరోగ్య పరీక్ష


ముందస్తు వైద్య పరీక్షలతో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు.. పొంచి ఉన్న వ్యాధులను పసిగట్టవచ్చని చెప్పుకున్నాం. రోజుకో వైద్య పరీక్షలో భాగంగా ఈ రోజు ఒకదాని గురించి తెలుసుకోండి. 

వైద్య పరీక్ష - 2
ప్రతీ మహిళకు తల్లి కావడమనేది ఎంతో సంతోషకరమైన విషయం. పండంటి బిడ్డ కోసం ముందస్తుగా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గర్భం దాల్చడానికి ముందు మహిళలు పాప్ స్మియర్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం. దీనివల్ల గర్భాశయ ముఖద్వార కేన్సర్ ఉన్నా.. కేన్సర్ అప్పుడప్పుడే అభివద్ధి చెందుతున్నా ముందే గుర్తించవచ్చు. గర్భధారణకు ముందే దీనిని చేయించుకుంటే నిశ్చింతగా ఉండవచ్చు.  

మహిళలు రెండేళ్లకోసారి ఈ పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు . అభివృద్ధి చెందిన దేశాలలో అయితే సాధారణ పరీక్షల్లాగే మహిళలు పాప్ స్మియర్ కూడా తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. 20 నుంచి 50- 60ఏళ్ల వయసు వారు ఈ పరీక్ష చేయించుకోవాలి. 

  • Loading...

More Telugu News