: బాలీవుడ్ లో నటించే ఆలోచన లేదు: సన్నీ లియోన్ భర్త
బాలీవుడ్ చిత్రాలలో నటించే ఆలోచనలు లేవని నీలి చిత్రాల తార సన్నీలియోన్ భర్త డానియెల్ వెబర్ స్పష్టం చేశారు. 'బాలీవుడ్ లో నటించాలన్న కోరికలు లేవు. నటించాలనుకోవడం లేదు. నాకో చిత్ర నిర్మాణ సంస్థ (బూతు చిత్రాలు) ఉంది. దాన్ని చూసుకోవాలి. సన్నీ లియోన్ షెడ్యూల్స్ ను కూడా నేనే చూడాలి. సో, నాకు తీరిక లేదు. ప్రస్తుతం మా మకాం భారత్ మార్చాం. ముంబైలో ఉంటున్నాం. సన్నీతో కలిసి హిందీ నేర్చుకుంటున్నాను. భారతీయ భాష కనుక నేర్చుకుంటున్నానేగానీ, బాలీవుడ్ లో నటించేందుకు కాదు' అని డానియెల్ వివరించాడు.