: ప్రేమికులకో శుభవార్త


ప్రేమికులకు ఒక శుభవార్త... మీరు ఎక్కడున్నా మీ ప్రియుడు లేదా ప్రియురాలి గుండె చప్పుడును సదా వినాలకునేవారికి మాత్రం ఇది నిజంగా ఒక శుభవార్తే. మీకు ఇష్టమైన వారి గుండె చప్పుడును మీకు వినిపించే కొత్తరకం యాప్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌తో మీకు ఇష్టమైన వారి గుండె చప్పుడును మీరు వింటూ ఉంటారు. దీనికి కావలసిందల్లా మీ చేతిలో చక్కటి ఫోను ఉండడంతోబాటు అవతలివారు రిస్ట్‌బ్యాండ్‌ను లేదా ఒక రింగ్‌ను ధరించడమే.

బ్రిటన్‌కు చెందిన లిటిల్‌ రియట్‌ అనే కంపెనీ పిల్లోటాక్‌ అనే యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌తో మీ ప్రేమికులు ఎక్కడున్నా వారి హృదయ స్పందనను మీరు వింటూనే ఉంటారు. ఈ కొత్తరకం యాప్‌తో ఇద్దరు వ్యక్తులు వారి హృదయ స్పందనను పరస్పరం వినొచ్చని కంపెనీవారు చెబుతున్నారు. ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అవతలివారు రిస్ట్‌బ్యాండ్‌ లేదా రింగ్‌ను ధరించాలి. బ్లూటూత్‌ ద్వారా పనిచేసే ఈ పరికరాల ద్వారా అవతలి వ్యక్తి హృదయస్పందన ఇవతలి వ్యక్తికి చేరుతుందట. దీంతో దూరంగా ఉన్నామనే భావం లేకుండా ఉంటుందికదా అంటున్నారు కంపెనీవారు.

  • Loading...

More Telugu News