: సెంచరీ దిశగా పుజారా


భారత బ్యాటింగ్ యువకెరటం చటేశ్వర్ పుజారా (79 బ్యాటింగ్) మరోసారి చక్కని ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్ లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్న పుజారా సెంచరీ దిశగా సాగుతున్నాడు. సఫారీ గడ్డపై రస్టెన్ బర్గ్ లోని ఒలింపియా పార్క్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 2 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. టాస్ గెలిచిన భారత్-ఎ జట్టు బ్యాటింగ్ ఎంచుకోగా, ఓపెనర్లుగా బరిలో దిగిన ధావన్ 11, మురళీ విజయ్ 44 పరుగులు చేశారు. అనంతరం కెప్టెన్ పుజారా.. రోహిత్ శర్మ (33 బ్యాటింగ్) తో కలిసి ఇన్నింగ్స్ నడిపించే బాధ్యతను స్వీకరించాడు. పుజారా, రోహిత్ జోడీ మూడో వికెట్ కు 75 పరుగులు జోడించి జట్టును పటిష్ఠమైన స్థితిలో నిలిపింది.

  • Loading...

More Telugu News