: విభజిస్తే రాజకీయ సన్యాసమే: ఎంపీ రాయపాటి


రాష్ట్ర విభజనపై ఎంపీ రాయపాటి సాంబశివరావు రోజుకో వ్యాఖ్యతో సంచలనం రేపుతున్నారు. గుంటూరులో సమైక్యాంధ్ర దీక్ష శిబిరాన్ని సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర విభజన జరిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. సోమవారం ఆంటోనీ కమిటీని కలవనున్నానని, ఆ కమిటీకి సీమాంధ్ర ప్రజల మనోభావాలను తెలియజేస్తానని తెలిపారు. సీమాంధ్ర జిల్లాలన్నింట్లో సమైక్యోద్యమ సెగలు మిన్నంటాయని.. ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయని అన్నారు. వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తుండగా, విద్యాసంస్థలు కూడా బంద్ ప్రకటిస్తున్నాయన్నారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ మూతపడ్డాయని వీటిపై ఆంటోనీ కమిటీకి నివేదిస్తానని రాయపాటి తెలిపారు.

  • Loading...

More Telugu News