: తెలంగాణ వైఎస్సార్సీపీ నేతలు కాంగ్రెస్ లో చేరాలి: శంకర్రావు


తెలంగాణ ప్రాంత వైఎస్సార్సీపీ నేతలంతా కాంగ్రెస్ లోకి రావాలని మాజీ మంత్రి శంకర్రావు పిలుపునిచ్చారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని వైఎస్సార్సీపీ నాయకత్వం నడిపిస్తోందని ఆరోపించారు. వైఎస్ విజయమ్మ నిరహార దీక్షకు దిగడమే అందుకు నిదర్శనమని స్పష్టం చేశారు. తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడిన వైఎస్సార్సీపీలో తెలంగాణ ప్రాతంలో ఎవరూ మిగలరని జోస్యం చెప్పారు. సమైక్యాంధ్ర ఉద్యమం వెనుక ఎవరున్నారో తేల్చేందుకు సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్ర ప్రభుత్వానికి శంకర్రావు విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News