: దేవినేని ఉమపై నాన్ బెయిలబుల్ కేసు
ఈ రోజు ఉదయం ఆమరణ దీక్షకు యత్నించిన టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమను అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు ఆయనపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు బెజవాడ వచ్చిన మచిలీపట్నం ఎంపీ కొనకళ్ళ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఉమను కోర్టులో హాజరుపరుస్తారని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రకటన వెనక్కి తీసుకునేవరకు దీక్ష కొనసాగిస్తానని ఉమ చెప్పారని కొనకళ్ళ పేర్కొన్నారు.