: సీమాంధ్ర ఉద్యోగులపై అస్త్రాల ప్రయోగానికి ప్రభుత్వం సిద్ధం
సచివాలయంలో సమ్మె చేస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జీవో నెంబర్ 177 ప్రకారం వీరిపై చర్యలకు ఉపక్రమించేందుకు సిద్దపడుతున్నట్టు సమాచారం. చర్యలపై కసరత్తు చేయాలని అన్ని విభాగాధిపతులకు ప్రభుత్వం సూచించినట్టు తెలుస్తోంది. తమ పరిధిలోని ఉద్యోగుల హాజరు పంపించాలని విభాగాధిపతులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.