: 'కేసీఆర్ కే భద్రత లేదు.. సీమాంధ్రులెంత?'
హైదరాబాద్ లో ఉండే సీమాంధ్రులకు భద్రతపై అందరు నేతలూ హామీలు గుప్పిస్తున్నారు. ప్రధానంగా టీఆర్ఎస్ నేతలైతే హైదరాబాద్ లో సెటిలర్స్ భయాందోళనలు చెందాల్సిన అవసరంలేదని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సెటిలర్స్ ఫ్రంట్ అధ్యక్షుడు శ్రీనివాసరాజు యూపీఏ సర్కారుకు కొన్ని సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ లో సీమాంధ్రుల భద్రతపై స్పష్టత వచ్చేవరకు విభజన ఆపాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ లో తనకు భద్రత లేదని, జడ్ ప్లస్ కేటగిరీ భద్రత కావాలని సాక్షాత్తూ కేసీఆరే కోరుతున్నాడని, అలాంటిది సీమాంధ్రులకు ఎలా భద్రత ఉంటుందని ఆయన ప్రశ్నిస్తున్నారు. అభివృద్ధి సమస్యకు విభజనే పరిష్కారం కాదని, అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఈ నెల 31, సెప్టెంబర్ 1వ తేదీలలో కూకట్ పల్లిలో దీక్ష చేపడుతున్నట్టు శ్రీనివాసరాజు తెలిపారు.