: వీహెచ్ పై దాడిని ఖండిస్తున్నాం.. ఇంకా కలిసుండాలా?: హరీశ్ రావు


రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుపై తిరుపతిలో సమైక్యవాదులు దాడి చేయడం పట్ల టీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. అలిపిరి గేట్ వద్ద ఆయనపై దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ, సీమాంధ్రలో తెలంగాణ వారిపై దాడులు జరుగుతున్నాయని, ఇంకా కలిసుండాలా? అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రలో తమవారిపై దాడుల పట్ల అక్కడి నేతలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇక, హైదరాబాదు అమీర్ పేటలో ఉన్న ప్రకృతి వైద్య చికిత్సాలయానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన సాయిరాం అనే వ్యక్తిని సంచాలకుడిగా నియమించారని ఆరోపించారు. ఆయన కనీసం హెడ్ ఆఫ్ ద డిపార్ట్ మెంట్ గా పనిచేసేందుకు కూడా అనర్హుడని కోర్టు పేర్కొందని, ఇప్పుడాయనను ఏకంగా డైరక్టర్ గా నియమించారని దుయ్యబట్టారు. సాయిరాంకున్న అర్హతల్లా రాజకీయ పలుకుబడేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రాంతంలో ఆయన కంటే విద్యాధికులు, ప్రతిభావంతులు, అనుభవజ్ఞులు ఉన్నారని, వారికి లాబీయింగ్ తెలీదని అన్నారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుంటే టీఆర్ఎస్ ఊరుకోదని, ప్రభుత్వం తక్షణమే ఈ ఉత్తర్వులు ఉపసంహరించుకోవాలని హరీశ్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News