: వీహెచ్ కు తిరుపతిలో చేదు అనుభవం


కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావుకు సమైక్య సెగ తగిలింది. తిరుమలలో వెంకన్న దర్శనం అనంతరం తిరుపతి చేరుకున్న వీహెచ్ కు అలిపిరి వద్ద చేదు అనుభవం ఎదురైంది. సమైక్యవాదులు ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని అడ్డగించి, అద్దాలు పగలగొట్టారు. దీంతో, అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, సమైక్యవాదులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది.

  • Loading...

More Telugu News