: అమీర్ ఖాన్ కు డాక్టరేట్
బాలీవుడ్ లో విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ లా నిలిచే హీరో అమీర్ ఖాన్. లగాన్, తారే జమీన్ పర్, గజిని, తాజాగా ధూమ్-3.. ఇలా విభిన్న పాత్రలతో నిర్మాతలకు కాసుల వర్షం కురిపించడం అమీర్ స్టయిల్. సినిమా రంగానికి ఈ ఖాన్ చేసిన సేవలకుగాను హైదరాబాదులోని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఉర్దూ యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయాలని నిర్ణయించింది. కేంద్రమంత్రి పళ్ళంరాజు చేతులమీదుగా ఈ నెల 24న గచ్చీబౌలీలోని శాంతిసరోవర్ లో జరిగే వర్శిటీ స్నాతకోత్సవంలో అమీర్ ఖాన్ కు ఈ డాక్టరేట్ అందజేయనున్నారు.