: రాఖీ పండుగ రోజున హర్యానాలో మహిళలకు ఉచిత ప్రయాణం
రక్షా బంధన్ పండుగను పురస్కరించుకుని హర్యానా ప్రభుత్వం మరోసారి మహిళలకు ఉచిత ప్రయాణ అవకాశం కల్పించింది. ఆడపడచులు, తమ సోదరులతో బంధం కలకాలం నిలిచిపోవాలని ఆశిస్తూ వారి చేతికి రాఖీ కట్టే విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో రాఖీ పండుగ రోజున మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ఉచితంగా ప్రయాణించవచ్చని హర్యానా ప్రభుత్వం ప్రకటించింది.
అంతేకాదు మహిళలు తమ వెంట 15 ఏళ్లలోపు పిల్లలనూ చార్జీ లేకుండా తీసుకెళ్లవచ్చు. ఆర్డినరీ బస్సులలో ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని ప్రకటించింది. ఈ నెల 20న అక్కడ రక్షా బంధన్ జరుపుకుంటారు. ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని మొదటి సారిగా 2006లో అక్కడ అమల్లో పెట్టారు.