: దేశం వెనక్కి పోయే ప్రశ్నే లేదు: ప్రధాని


మళ్లీ 1991 నాటి సంక్షోభాన్ని చవిచూసే ప్రశ్నే లేదని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. రూపాయి క్రమంగా పతనమైపోతూ ఉండడం, కరెంటు ఖాతా లోటు పెరగడం, ప్రభుత్వం అన్ని రకాల నియంత్రణ చర్యలు ప్రకటిస్తూ ఉండడంతో మళ్లీ 1991 సంస్కరణల ముందునాటి విధానాలకు మళ్లేలా కేంద్రం చర్యలు ఉన్నాయంటూ విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.

1991లో దేశం విదేశీ మారక ద్రవ్యం లేక, దిగుమతులకు చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొన్నది. అప్పట్లో డాలర్ తో రూపాయి మారకం విలువ ఫిక్స్ డ్ గా ఉండేది. ప్రస్తుతం రూపాయి మారకం విలువ మార్కెట్ కు అనుగుణంగా నడుస్తోంది. దీంతో మళ్లీ ఫిక్స్ డ్ విధానాన్ని కేంద్రం ప్రవేశపెడుతోందంటూ వదంతులు వచ్చాయి.

దీనిపై ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందిస్తూ.. 1991లో కేవలం 15 రోజులకు సరిపడా మాత్రమే విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయని.. కానీ, నేడు ఆరేడు నెలలకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయని చెప్పారు. కనుక ప్రస్తుత స్థితిని నాటి రోజులతో పోల్చవద్దని, మళ్లీ 1991 నాటి సంక్షోభాన్ని దేశం ఎదుర్కొనే ప్రశ్నే లేదన్నారు.

  • Loading...

More Telugu News