: కాంగ్రెస్ నేతలు సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారు: మాగంటి బాబు


కాంగ్రెస్ అధిష్ఠానం ముందు సీమాంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్ర మంత్రులు, ఎంపీలు తాకట్టు పెట్టారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి మాగంటి బాబు ఆరోపించారు. పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో ఆయన మాట్లాడుతూ కేవలం రాజకీయ ప్రయోజనం కోసమే రాష్ట్రాన్ని ముక్కలు చేసే నిర్ణయం తీసుకుందని అన్నారు. రాజకీయాలకు అతీతంగా సీమాంధ్ర ప్రజలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఐదుతరాలు పూర్తయినా హైదరాబాద్ లాంటి నగరాన్ని అభివృద్ధి చేయడం అసాధ్యమన్నారు. విదేశీయురాలికి గులాములై రాష్ట్ర విభజన నిర్ణయం పట్ల సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News