: సీఆర్పీఎఫ్ చీఫ్ గా దిలీప్ త్రివేది


సీఆర్పీఎఫ్ కు కొత్త చీఫ్ గా దిలీప్ త్రివేది నియమితులయ్యారు. ఉత్తరప్రదేశ్ కేడర్ కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ దిలీప్ త్రివేది 1978 బ్యాచ్ కు చెందిన అధికారి. ఈయన పలు హోదాల్లో పని చేశారు. ప్రణయ్ సహాయ్ స్థానంలో దిలీప్ త్రివేది విధులు నిర్వర్తించనున్నారు. గతంలో త్రివేది ఇండోటిబెటన్ బోర్డర్ ఫోర్స్ అధికారిగా పని చేశారు. 3 లక్షలకు పైగా సిబ్బంది కలిగిన సీఆర్పీఎఫ్ కు త్రివేది సేవలందించనున్నారు. సీఆర్పీఎఫ్ ప్రధానంగా నక్సల్స్ అణచివేతలో ప్రభుత్వాలకు సహాయపడుతుంది.

  • Loading...

More Telugu News