: పెరిగిపోతున్న పాక్ కాల్పుల చిట్టా
పాకిస్థాన్ వైఖరిలో మార్పు వచ్చేట్టు కనిపించడంలేదు. సరిహద్దుల్లో మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. జమ్మూకాశ్మీర్లోని పూంచ్ జిల్లాలో మంథార్, హామీర్పూర్ ప్రాంతాల్లో పాక్ సైన్యం శుక్రవారం రాత్రి భారత బలగాలపై కాల్పులకు తెగబడింది. గత పది రోజుల వ్యవధిలో పాక్ ఈ విధంగా కాల్పులు జరపడం 18వ సారి. తాజా కాల్పుల్లో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది.