: 19న నింగికేగనున్న జీఎస్ఎల్వీ డీ5
నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ఈ నెల 19న జీఎస్ఎల్వీ డీ5 రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఇందుకు రేపు ఉదయం కౌంట్ డౌన్ ప్రారంభం కానుంది. 19న సాయంత్రం 4.30 గంటలకు కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్-14ను తీసుకుని జీఎస్ఎల్వీ డీ5 రోదసిలోకి వెళుతుంది.