: ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్లే ఉమ అరెస్ట్: పోలీసులు
ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్లే ఎమ్మెల్యే దేవినేని ఉమను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అవనిగడ్డ ఉప ఎన్నిక నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కృష్ణా జిల్లా అంతటా అమల్లో ఉందని, ఎటువంటి నిరసనలు, దీక్షలు, ర్యాలీలకు అనుమతి లేదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగ నిపుణుల సూచనలకు అనుగుణంగా ఎమ్మెల్యేను అరెస్ట్ చేశామని తెలిపారు.