: దుర్మార్గ ప్రభుత్వం: వర్ల రామయ్య
ఆమరణ దీక్ష ప్రారంభానికి ముందే ఎమ్మెల్యే దేవినేని ఉమను అరెస్ట్ చేయడం అన్యాయమని టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఇది దుర్మార్గ, రాక్షస చర్యగా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్షకు సంఘీభావం తెలిపేందుకు గొల్లపూడి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కైకలూరు ఎమ్మెల్యే దీక్షకు ఎలా అనుమతి ఇచ్చారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇది హక్కులను అడ్డుకోవడమేనన్నారు.