: ఎమ్మెల్యే దేవినేని ఉమ అరెస్ట్
బెజవాడలో నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి అన్యాయం జరుగుతోందంటూ దేవినేని ఉమ నేటి నుంచి ఆమరణ దీక్ష తలపెట్టారు. ఇందుకోసం గొల్లపూడిలోని తన నివాసం నుంచి దీక్షా శిబిరానికి బయల్దేరగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. వాస్తవానికి ఆమరణ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో అనుమతి లేకుండా దీక్ష నిర్వహించడానికి వీల్లేదంటూ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విజయవాడ వన్ టౌన్ స్టేషన్ కు తరలించారు.