: అప్పుతో ముప్పే


అప్పులేనివాడు అధిక సంపన్నుడు అంటూ మన కవులు ఏనాడో అప్పు గురించి చెప్పుకొచ్చారు. అయితే అప్పు ఉంటే దాని ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుందని శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో గుర్తించారు. అప్పు అధిక రక్తపోటుకు దారి తీస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది.

కొందరు శాస్త్రవేత్తలు 24 నుండి 32 ఏళ్ల మధ్య వయసున్న దాదాపు 8,400 మందిపై నిర్వహించిన పరిశోధనలో వారి ఆరోగ్య స్థితిపై అప్పులు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్టు తేలింది. అప్పులు ఎక్కువగా ఉండడం వల్ల అది వారిలో హైబీపీతోబాటు పలు రకాలైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పుల కారణంగా ఒత్తిడి, ఆందోళన వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో 20 శాతం మంది తమ ఆస్తుల విలువకంటే అప్పుల విలువే ఎక్కువని చెప్పారట. కాబట్టి అప్పులు చేయడం తగ్గిస్తే మన ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందంటున్నారు పరిశోధకులు.

  • Loading...

More Telugu News