: కాఫీతో గుండెకు ముప్పే


రోజూ ఉదయాన్నే కాస్త కాఫీ పడితే తప్ప కొందరు పనిలోకి దిగలేరు. మరికొందరైతే కప్పులకు కప్పులు కాఫీ లాగించేస్తుంటారు. ఇలా ఎక్కువ కాఫీ లాగించేస్తే వారి గుండెకు అది ప్రమాదకరంగా పరిణమిస్తుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రోజుకు ఒకటిరెండు కప్పులు మినహాయించి ఎక్కువగా కాఫీ తాగడం అంత మంచిది కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

దక్షిణ కరోలినా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన ఒక అధ్యయనంలో రోజుకు నాలుగు కప్పులకు మించి కాఫీ తాగితే అది వారి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని తేలింది. అందునా 55 ఏళ్లకు లోపుగా ఉన్నవారిలో రోజుకు నాలుగు కప్పులకంటే ఎక్కువ కాఫీని తాగితే అది వారి గుండె పనితీరుపై ప్రభావాన్ని చూపుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీరు తమ అధ్యయనంలో భాగంగా 25 నుండి 87 ఏళ్లలోపు వయసున్న దాదాపు 40 వేలమందిని 1978 నుండి 1998 మధ్య పరిశీలించారు. వీరి అలవాట్లను, జీవనశైలిని ఈ అధ్యయనంలో పరిశీలించారు. కాఫీని ఎక్కువగా ఇష్టపడేవారు పొగతాగేందుకు కూడా ఎక్కువగా ఇష్టపడుతున్నారని పరిశోధకులు గుర్తించారు. ఇది వారి గుండె పనితీరు సామర్ధ్యంపై ప్రభావాన్ని చూపుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన జరుగుతున్న సమయంలోనే 2512 మంది చనిపోయారు. అన్ని రకాల కారణాలతో కలిపి ఈ ముప్పు 56 శాతం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News