: వాయేజర్ వెరీగుడ్
అంతరిక్షంలో సౌరకుటుంబాన్ని అధిగమించిన మానవ నిర్మితమైంది ఏదీ లేదు. తాజాగా వాయేజర్`1 వ్యోమనౌక అంతరిక్షంలో సౌరకుటుంబాన్ని అధిగమించింది. దీంతో సౌరకుటుంబాన్ని దాటిన మొదటి మానవ నిర్మిత వస్తువుగా ఇది గుర్తింపు పొందింది.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా సౌరకుటుంబం అంచుల్లో ఉన్న గ్రహాలను గురించి అధ్యయనం చేయడానికి వాయేజర్`1, వాయేజర్`2 అనే రెండు వ్యోమనౌకలను 1977లో ప్రయోగించింది. ఈ రెండు వ్యోమనౌకలు అప్పటినుండి అంతరిక్షంలో ప్రయాణిస్తూనే ఉన్నాయి. తాజా పరిశోధనలో వీటిలో వాయేజర్`1 అనే వ్యోమనౌక అంతరిక్షంలో సౌరకుటుంబాన్ని దాటి తారాంతర ప్రదేశంలోకి ప్రవేశించినట్టు తేలింది. గత ఏడాదే ఇది ఈ మైలురాయిని అధిగమించినట్టు నాసా వివరించింది. ఇప్పటి వరకూ సౌరకుటుంబాన్ని దాటిన తొలి మానవ నిర్మిత వస్తువుగా వాయేజర్`1 గుర్తింపు పొందింది.