: ప్రధాని కాన్వాయ్ ని అడ్డగించబోయిన బీజేపీ నేతలు
ప్రధానికి నిరసన తెలిపేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఓమ్ని ఆస్పత్రిలో బాధితులను పరామర్శించి ప్రధాని విక్టోరియా
స్మారక గృహానికి తిరిగి వెళుతుండగా ప్రధాని కాన్వాయ్ ని అడ్డుకునేందుకు మార్గ మధ్యంలో బీజేపీ నేతలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ కి తరలించారు. భారీ భద్రత ఉండడం వల్ల బీజేపీ నేతల ప్రయత్నం ఫలించలేదు.