: ధరల నియంత్రణకు చర్యలు చేపట్టండి: అధికారులతో సీఎం
సీమాంధ్రలో సమ్మె పరిస్థితుల నేపథ్యంలో నిత్యావసరాల ధరలు భగ్గుమనడంపై సీఎం కిరణ్ నేడు అధికారులతో సమీక్షించారు. అధికారులతో సచివాలయంలో భేటీ అయిన సీఎం ఈమేరకు తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. తక్షణమే ధరల నియంత్రణకు చర్యలు ప్రారంభించాలని సూచించారు. సీమాంధ్రలో సమ్మెతో పరిపాలన స్తంభించిన నేపథ్యంలో అత్యవసర సేవలకు ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.