: తెలంగాణ మంత్రులతో పీసీసీ చీఫ్ భేటీ
ఆంటోనీ కమిటీ హైదరాబాద్ రానున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంత నేతలతో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. హైదరాబాదులోని గాంధీ భవన్లో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. కాగా విభజన ప్రకటనపై సీమాంధ్రలో చెలరేగిన ఆందోళనలపై సమాచారాన్ని, విజ్ఞప్తులను స్వీకరించేందుకు ఆంటోనీ కమిటీ త్వరలో హైదరాబాద్ రానుంది. ఆ కమిటీని కలిసేందుకు తెలంగాణ మంత్రులు ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.