: బ్రోకర్లెవరో అందరికీ తెలుసు: దిలీప్ కుమార్


బ్రోకర్ అంటూ టీఆర్ఎస్ తనపై చేసిన వ్యాఖ్యలపై దిలీప్ కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణలో బ్రోకర్లెవరో అందరికీ తెలుసని టీఆర్ఎస్ నేతలపై మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పై 10 అంశాలకు సంబంధించిన ఆరోపణలున్న కవర్ ను జేఏసీకి పంపిస్తున్నానని ఆయన తెలిపారు. ఈ అంశాలపై జేఏసీ విచారణ జరిపించాలని దిలీప్ కోరారు. 2004 లో తెలంగాణ శత్రువైన టీడీపీ తో పొత్తు ఎలా పెట్టుకున్నారు? దీనికి బ్రోకరెవరని దిలీప్ ప్రశ్నించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తే దానికి కారకులు మీరు కాదా? అని మండిపడ్డారు.

టాలీవుడ్, ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారి పరిశ్రమలతో టీఆర్ఎస్ చేసుకున్న ఒప్పందాలేంటో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయా పరిశ్రమల నుంచి ఎంత వసూళ్లు చేశారో తెలపాలన్నారు. టీఆర్ఎస్ లో డబ్బున్నవారికే ఎందుకు టికెట్లిస్తున్నారో ప్రజలకు తెలపాలని కోరారు. ప్రోఫెసర్ జయశంకర్ ను టీఆర్ఎస్ లో అవమానించలేదా? అంటూ సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతలకు మాట్లాడే హక్కే లేదని, తనపై చేసిన ఆరోపణలు ఉపసంహరించుకోకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీఆర్ఎస్ నేతలను దిలీప్ కుమార్ హెచ్చరించారు.

  • Loading...

More Telugu News