: విజయమ్మే కాదు, బాబు దీక్ష చేసినా మద్దతిస్తాం: గంటా


సమైక్యాంధ్ర ఉద్యమానికి గట్టి మద్దతిస్తున్న మంత్రుల్లో గంటా శ్రీనివాసరావు ఒకరు. ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, సమైక్యాంధ్ర కోసం విజయమ్మే కాదు, చంద్రబాబు దీక్ష చేసినా మద్దతిస్తామని స్పష్టం చేశారు. తాము ఆశాజీవులమని, రాష్ట్రం ఒక్కటిగానే ఉంటుందని భావిస్తున్నామని తెలిపారు. కాగా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డితో రేపు సీమాంధ్ర మంత్రులందరూ భేటీ కానున్నారని గంటా చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై ఆయనతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ఇక ఆంటోనీ కమిటీ ఢిల్లీలో కూర్చుని విచారణ చేయడం కాదని, హైదరాబాదుతో పాటు సీమాంధ్రలో పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయని అన్నారు.

  • Loading...

More Telugu News