: బాషా భౌతికకాయానికి చంద్రబాబు నివాళి
గుంటూరు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. లాల్ జాన్ బాషా భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆ సమయంలో బాబు వెంట కోడెల శివప్రసాద్, కరణం బలరాం తదితరులున్నారు. కాగా, బాషా పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం స్థానిక బీఆర్ స్టేడియంలో ఉంచారు. తమ ప్రియతమ నేతను కడసారి దర్శించుకునేందుకు ఈ ఉదయం నుంచి భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు వస్తున్నారు. మరికాసేపట్లో బాషా అంతిమయాత్ర ప్రారంభం కానుంది.