: బాధితులు త్వరగా కోలుకోవాలి: ప్రధాని


బాధితులకు అండగా ఉంటామని, ఆందోళన చెందవద్దని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. దిల్ సుఖ్ నగర్లో బాంబు పేలుళ్లు జరిగిన ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ప్రధాని, మలక్ పేట యశోద, కొత్త పేటలోని ఓమ్ని ఆస్పత్రులలో చికిత్స తీసుకుంటున్న పేలుళ్ల బాధితులను పరామర్శించారు.

అనంతరం ప్రధాని మీడియాతో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించామని చెప్పారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అలాగే పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి సంతాపం తెలిపారు.

అనంతరం ఓమ్ని ఆస్పత్రి నుంచి ప్రధాని కొత్తపేటలోని విక్టోరియ హోమ్స్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి హెలికాప్టర్లో వెళ్లి ప్రత్యేక విమానంలో ఢిల్లీ ప్రయాణమవుతారు.

  • Loading...

More Telugu News