: గుంటూరు చేరుకున్న బాబు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుంటూరు చేరుకున్నారు. నిన్న నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన పార్టీ సీనియర్ నేత లాల్ జాన్ బాషా అంత్యక్రియల్లో పాల్గొనేందుకు బాబు ఈ ఉదయం హైదరాబాదు నుంచి గుంటూరు పయనమయ్యారు. కొద్దిసేపటిక్రితం విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బాబు.. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు లోని లాల్ జాన్ బాషా నివాసానికి చేరుకున్నారు.