: సీమాంధ్ర సచివాలయ ఉద్యోగుల సామూహిక సెలవు
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనలు రోజుకో రీతిన సాగుతున్నాయి. విధుల బహిష్కరణ, సహపంక్తి భోజనాలు, నిరసనలు, ఆందోళనలు, నినాదాలు, ఘొరావ్ లు, వెనక్కి నడవడాలు, సచివాలయ ముట్టడి వంటి రూపాల్లో నిరసనలు తెలిపిన సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు, నేడు సామూహికంగా సెలవు పెట్టారు. గత 17 రోజులుగా వీరు పోరుబాట పట్టడంతో సచివాలయంలో ఫైళ్లు పేరుకుపోతున్నాయి. సమస్యలు పరిష్కారం కావడం లేదు.