: మరింతగా పెరిగిన బంగారం, వెండి ధరలు
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఈ రోజు మరింతగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.31,410, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు రూ.30,100 వద్ద ట్రేడవుతున్నాయి. వెండి కిలో ధర రూ.50,000 లకు చేరుకుంది. శ్రావణ మాసం కావడం, బంగారం దిగుమతులపై సుంకం పెంపు సహా కఠిన ఆంక్షలను ప్రభుత్వం విధించడంతో, అంతర్జాతీయ మార్కెట్లో పెరగకపోయినా, దేశీయంగా బంగారం ధర పరుగులు తీస్తోంది. దీంతో బంగారం పూర్వపు గరిష్ఠ స్థాయి 32 వేలకు ఈ నెలలోనే చేరుకోవచ్చని అంచనా.