: మీ పిల్లలు చెడిపోతే సినిమాను నిందించకండి: షారూక్
పిల్లలపై సినిమాలు చెడు ప్రభావాన్ని చూపిస్తాయన్న వాదనను నటుడు షారూక్ ఖాన్ ఖండించారు. పిల్లలు చెడిపోతే సినిమాను నిందించకండంటూ సూచించాడు. సినిమా అనేది మంచి వేదికని, అందులోంచి మంచిని పొందవచ్చన్నాడు. చిన్నారులపై సినిమాలు చెడు ప్రభావాన్ని చూపిస్తాయని తాననుకోవడం లేదని, ఉన్న చెడంతా సినిమాలకు వెలుపలే ఉందని వ్యాఖ్యానించాడు. తాను సినిమాలు చూసే విషయంలో తన పిల్లలను నియంత్రించనని, వారు అన్ని రకాల చిత్రాలనూ చూస్తారని షారూక్ చెప్పాడు.