: శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు
శ్రావణ శుక్రవారం కావడంతో ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో భక్తుల సందడి నెలకొంది. భ్రమరాంబ అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి భక్తులు పోటెత్తారు. నేడు ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో పాల్గొనే భక్తులకు పూజా సామగ్రితోపాటు లక్ష్మీదేవి వెండి రూపును ఉచితంగా అందించనున్నట్లు ఆలయ ఈవో ఆజాద్ తెలిపారు.