: విమర్శలకు ఇదా సమయం?: మోడీకి అద్వానీ హితవు
ప్రధాని ఎర్రకోట ప్రసంగాన్ని తూర్పారబట్టిన గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ దూకుడుకు బీజేపీ సీనియర్ నేత అద్వానీ అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారు. దేశం యావత్తూ వేడుకలు జరుపుకునే ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఇలాంటి విమర్శలు తగవని ఆయన మోడీకి హితవు పలికారు. 'పరస్పర విమర్శలకు ఇదా సమయం?' అంటూ మందలింపు ధోరణిలో వ్యాఖ్యానించారు. కాగా, తన ప్రసంగమూ ప్రధాని ప్రసంగం స్థాయిలో హిట్టవుతుందని మోడీ నిన్న మన్మోహన్ కు ఓపెన్ చాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే.