: మంత్రి బాలరాజుపై గంటా ఆగ్రహం
మంత్రి బాలరాజు ఇంకా పదవిని పట్టుకుని వేళ్ళాడుతున్నాడని మరో మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, బాలరాజుపై ధ్వజమెత్తారు. తాను సమైక్యాంధ్ర కోసం పదవికి రాజీనామా చేశానని, బాలరాజు ఇంకా ఎందుకు రాజీనామ చేయలేదో ఆయన్నే అడగాలన్నారు. అయినా, డ్రామాలాడుతోంది ఎవరో అందరికీ తెలుసని ఈ సందర్భంగా గంటా వ్యాఖ్యానించారు.