: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమైక్యవాదులున్నారు: తులసిరెడ్డి
రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందన్న విశ్వాసం తనకుందంటున్నారు 20 సూత్రాల కమిటీ చైర్మన్ తులసిరెడ్డి. హైదరాబాదులో నేడు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ సమైక్యాంధ్ర కోరుకునేవాళ్ళు ఉన్నారని అన్నారు. సమైక్యవాదులందరూ గళం వినిపించాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. రాష్ట్రాన్ని ఒక్కటిగా ఉంచేందుకు అధిష్ఠానాన్ని ఒప్పించగలమని భావిస్తున్నట్టు తులసిరెడ్డి చెప్పుకొచ్చారు.