: గజల్ శ్రీనివాస్ వింత వాదన
ఇటీవలే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ప్రఖ్యాత గాయకుడు గజల్ శ్రీనివాస్ ఏమంటున్నాడో వినండి. రాష్ట్రం విడిపోతుందన్న బాధతో తెలంగాణ ప్రజలు సంబరాలు జరుపుకోవడంలేదట. ఇన్నాళ్ళూ కలసిమెలసి ఉన్న తాము ఇప్పుడు విడిపోవాల్సి రావడంతోనే వారు వేడుకలకు దూరంగా ఉన్నారని శ్రీనివాస్ సూత్రీకరించారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలు ఈ విషయమై ఎంతో ఆవేదన చెందుతున్నారని చెప్పుకొచ్చారు. త్వరలోనే విజయవాడలో కళాకారులు, రచయితలతో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.