: పేదలు అర్థాకలితో అలమటించకూడదనే..: ప్రధాని


ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ఉదయం ఢిల్లీలోని ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించారు. 67వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకావిష్కరణ అనంతరం ఆయన పలు అంశాలపై ఉపన్యసించారు. పేదలు అర్థాకలితో అలమటించకూడదనే కేంద్రం ఆహార భద్రత బిల్లుకు రూపకల్పన చేసినట్టు చెప్పారు. ఈ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతిస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఉపాధి హామీ పథకంతో దేశంలో ఉపాధికి లోటు లేకుండాపోయిందని వివరించారు. ఎన్ని పథకాలు ఏర్పాటు చేసినా చేయాల్సింది ఇంకా ఎంతో ఉందనిపిస్తోందని ప్రధాని అభిప్రాయపడ్డారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు, యువతకు ఉపాధి కల్పించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇక ఆర్ధికరంగ స్థితిగతులన వివరిస్తూ.. అమెరికా, యూరప్ లో నెలకొన్న మాంద్యం ప్రభావం మన దేశ వృద్ధి రేటుపై పడిందన్నారు. పొరుగుదేశం పాకిస్తాన్ విషయానికొస్తే, ఆ దేశంతో సంబంధాలు ప్రస్తుతం బాగా ఇబ్బందికరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News