: మంత్రి తోట సతీమణి ఆరోగ్యం విషమం
సమైక్యాంధ్ర కోసం ఆమరణ దీక్ష చేపట్టిన మంత్రి తోట నర్సింహం సతీమణి వాణి ఆరోగ్యం క్షీణిస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆమె గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్నారు. దీక్ష విరమించాలని వైద్యులు సూచించినా ఆమె తన వైఖరికి కట్టుబడి ఉన్నారు. దీంతో, ఆమె ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రస్తుతం దీక్షాస్థలం వద్దకు పెద్ద ఎత్తున మంత్రి అనుచరులు చేరుకున్నారు. కాగా, ఆమె దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు యత్నిస్తున్నారన్న వార్తలు రావడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. వాణిని పరామర్శించేందుకు మంత్రి శైలజానాథ్ సతీమణి మోక్ష ఇక్కడికి చేరుకున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనకు వాణితో ఆరేళ్ళ నుంచి పరిచయం ఉందని వెల్లడించింది.