: బాషా అంత్యక్రియలకు హాజరవనున్న బాబు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు గుంటూరులో జరిగే లాల్ జాన్ బాషా అంత్యక్రియలకు హాజరుకానున్నారు. ఆయనతో పాటు పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, గరికపాటి రామ్మోహనరావు కూడా గుంటూరుకు వెళ్ళనున్నారు. కాగా, ఈ సాయంత్రం ప్రజల సందర్శనార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఉంచిన బాషా పార్థివదేహాన్ని గుంటూరు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.