: ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు బాషా మృతదేహం
ఉదయం రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన టీడీపీ నేత లాల్ జాన్ బాషా మృతదేహాన్ని బంజారాహిల్స్ లోని ఆయన నివాసం నుంచి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు తరలించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దగ్గరుండి తరలింపు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఈ సమయంలో బాబు వెంట దేవేందర్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులున్నారు. అంతకుముందు నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం ముగిసిన వెంటనే ఆయన దేహాన్ని నేరుగా హైదరాబాదులో బంజారాహిల్స్ నివాసానికి తరలించిన సంగతి తెలిసిందే. అంత్యక్రియలు రేపు మధ్యాహ్నం ఆయన స్వస్థలం గుంటూరులో జరుగుతాయి.