: స్పీడు పెంచిన చిరంజీవి


సీమాంధ్ర ప్రాంతంలో సమైక్యాంధ్ర ఉద్యమ జ్వాలలు మిన్నంటుతుండగా.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ఢిల్లీలో వేగంగా పావులు కదుపుతున్నారు. ఇతర మంత్రులకు ఆయనే దిశానిర్ధేశం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన నివాసంలో ఈ సాయంత్రం సీమాంధ్ర కేంద్ర మంత్రులు సమావేశమయ్యారు. ఆంటోనీ కమిటీని ఈ సాయంత్రం వారు కలవాల్సి ఉంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ నిలిపివేసి, రెండో ఎస్సార్సీ వేయాలని ఆంటోనీ కమిటీ ఎదుట చెప్పాలని వారు నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ భేటీలో చిరంజీవితో పాటు కావూరి సాంబశివరావు, పళ్ళంరాజు, పనబాక లక్ష్మి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, జేడీ శీలం తదితరులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News